ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాంలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. శనివారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశించింది. గతంలో కూడా ఏప్రిల్ 18న ఆయన సిట్ ఎదుట హాజరై మద్యం అక్రమాల్లో కేసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు. తనకు మద్యం పాలసీపై జరిగిన సమావేశాలకు సంబంధం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు.