AP: విజయవాడ ఉత్సవ్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్ ముఖ్యఅతిథులుగా హాజరై విజయవాడ ఉత్సవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్రాకర్స్ షో కళ్లు మిరిమిట్లు గొలిపింది. ప్రకాశం బ్యారేజీపై బాణసంచా వెలుగులు కనువిందు చేశాయి. వెంకయ్య నాయుడు, లోకేష్ పున్నమి ఘాట్‌లో క్రాకర్స్ షోను తిలకించారు. 'విజయవాడ ఉత్సవ్' ఏర్పాట్లను వెంకయ్య అభినందించారు.