గత పాలనలో గ్రామాలు కన్నీళ్లు పెట్టాయి: సీఎం చంద్రబాబు

AP: రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె పండుగ’ కార్యక్రమం విజయవంతమైందని, ఇది గ్రామాల్లో నిజమైన మార్పునకు నాంది పలుకుతోందని సీఎం చంద్రబాబు అన్నారు. నెల్లూరు జిల్లా రామాపురంలో జరిగిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..  వైసీపీ ప్రభుత్వ పాలనలో విధ్వంసంతో గ్రామాలు తీవ్రంగా కన్నీళ్లు పెట్టాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుంతల రోడ్లే దర్శనమిచ్చేవని, గ్రామాలకు వెళ్లలేని దుస్థితి ఉండేదని గుర్తుచేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕