వైసీపీ నేతలపై వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్ర ఆరోపణలు

AP: రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ స్థానిక నాయకత్వమే లక్ష్యంగా వినుకొండ శాసనసభ్యులు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోని రూ.1,500 కోట్ల భూ కబ్జా ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు హస్తం ఉందంటూ ఎమ్మెల్యే జీవీ ఫైర్ అయ్యారు. కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూములను కొట్టేసేందుకు దొంగ పత్రాలు సృష్టించారని మండిపడ్డారు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం వెనుక వైసీపీ నాయకులే ఉన్నారని, రాష్ట్రంలో అశాంతిని రేపడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడమే జగన్ ఎజెండా అని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్