AP: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వ అరాచకాలు కొనసాగుతున్నాయని వైఎస్సార్ సీపీ ఆరోపించింది. నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు దగ్గరుండి మరీ టీడీపీ గుండాలను వైఎస్సార్ సీపీ శ్రేణులపైకి ఉసిగొల్పుతున్నారని పేర్కొంది. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, రాష్ట్రంలో భీతావహ వాతావరణం నెలకొందని ఆ పార్టీ నాయకులు వాపోయారు. ప్రభుత్వం కావాలనే దాడులను ప్రోత్సహిస్తోందని విమర్శలు వస్తున్నాయి.