AP: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు విష ప్రచారం చేశారని మాజీ మంత్రి, వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చంద్రబాబు అబద్ధాలు ప్రచారం చేశారన్నారు. డాక్యుమెంట్లు ఇవ్వరని, వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకుంటారని దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. సంపద సృష్టిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నేడు రూ.2,66,000 కోట్లు అప్పు మాత్రం చేశారని పేర్కొన్నారు.