AP: దశాబ్దాల చరిత్ర కలిగిన విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమాన సర్వీసులు నేటి అర్ధరాత్రి నుంచి శాశ్వతంగా నిలిచిపోనున్నాయి. గత నాలుగున్నర దశాబ్దాలుగా సేవలు అందించిన ఈ విమానాశ్రయానికి వీడ్కోలు పలుకుతూ, రేపటి నుంచి అన్ని సాధారణ ప్రయాణికుల విమాన సర్వీసులు నూతనంగా అందుబాటులోకి వచ్చిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచే నిర్వహించనున్నారు. దీంతో విశాఖ విమానాశ్రయం ఇకపై పూర్తిగా భారత నావికాదళం ఆధ్వర్యంలోనే పనిచేయనుంది.