పదేళ్లలోనే విశాఖ నగరం ఐటీ హబ్‌గా మారుతుంది: లోకేశ్

AP: పదేళ్లలోనే విశాఖపట్నం నగరాన్ని ఐటీ హబ్‌గా మారుస్తామని మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కంటే మెరుగైన అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. విశాఖలో పూర్తి ఎకో సిస్టమ్​ను సిద్ధం చేస్తున్నామని, డేటా సెంటర్లను తీసుకురావడమే కాకుండా వాటి నిర్వహణ కూడా కీలకమని అన్నారు. పరిశ్రమలను తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, రాష్ట్రానికి వచ్చిన ప్రతి పరిశ్రమకు ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్