ఎకనమిక్‌ రీజియన్‌ కింద విశాఖ అభివృద్ధి: సీఎం చంద్రబాబు

AP: విశాఖపట్నంలో కాగ్నిజెంట్ సంస్థ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాగ్నిజెంట్ సంస్థకు భారతదేశం నుంచే 2,41,500 మంది ఉద్యోగులు ఉన్నారని, సంస్థ చీఫ్ కూడా భారతీయుడేనని తెలిపారు. విశాఖపట్నం నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి కేంద్రంగా మారబోతోందని, త్వరలోనే మెట్రో రైలు కూడా వస్తుందని, విశాఖను ఎకనమిక్ రీజియన్‌గా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్