ఘనంగా ఆలయ వార్షికోత్సవం

విశాఖలోని ఆరిలోవలో శ్రీ ఉమా నాగలింగేశ్వర ఆలయ 14 వ వార్షికోత్సవ మహోత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా తెలుగుదేశం నాయకుడు, సినీ నిర్మాత కంచర్ల అచ్యుత రావు హాజరయ్యారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు అచ్యుతరావును సత్కరించారు.

సంబంధిత పోస్ట్