విశాఖ రుషికొండపై టీడీపీ జెండా రెపరెపలాడింది. రుషికొండను ఇంతవరకు వైసీపీ అడ్డాగా ఉండగా. అక్కడ సీఎం జగన్ ముఖ్యమంత్రి హోదాలో కార్యకలాపాలు సాగించేందుకు అనువుగా కళ్లు చెదిరేలా భవనాలు కట్టారు. ఆ ప్రాంతం పూర్తిగా రిస్ట్రక్ట్ ఏరియాగా ఉంది. ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించడంతో జగన్ కలల సౌధంపై టీడీపీ నేతలు సోమవారం జెండా ఎగురవేయడం చర్చనీయాంశంగ మారింది.