ప్రతి జీవినీ బతికేందుకు కృషి చెయ్యాలని వ్యూస్ ఎన్‌జిఒ కో ఆర్డినేటర్ రాజేశ్వరి కోరారు. గురువారం విశాఖలోని చిన్న వాల్తేరు లోని జివిఎంసి ప్రాథమిక పాఠశాల లో వ్యూస్ ఎన్జిఒ, ఆస్ట్రేలియన్ కాన్సలేట్ నేతృత్వంలో క్లైమేట్ చేంజ్ ఫర్ యూత్ యాక్షన్ ప్రోగ్రామ్ లో భాగంగా విద్యార్థుల చేత మట్టి పాత్రలలో నీరు అందుబాటులో ఉంచిన తర్వాత ఆమె మాట్లాడారు. వేసవిలో పక్షులకు నీరు పెట్టండి అని కోరారు.