ప్రధాని మోదీ ఘనతను వివరిస్తూ వినూత్న ఫ్లెక్సీ ఏర్పాటు

భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం జిల్లా గాజువాక పరిధిలోని పెదముషిడివాడలో పరవాడ మండల బిజెపి అధ్యక్షులు పిల్లా సతీష్ ఆధ్వర్యంలో వినూత్న ఫ్లెక్సీ బ్యానర్ ఏర్పాటు చేశారు. గడిచిన పన్నెండు సంవత్సరాలలో ప్రధాని మోదీ సాధించిన అపూర్వ ఘనతలు, చారిత్రాత్మక రికార్డులను వివరిస్తూ రూపొందించిన ఈ బ్యానర్ స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కేవలం ఫోటోలకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు పిల్లా సతీష్ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕