ఆటో ఢీకొని వ్యక్తి మృతి

దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 24వ తేదీ తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పెంటపాటి వెంకటరాజు (51) అనే వ్యక్తి మృతి చెందారు. దువ్వాడ నుంచి మంగళపాలెం వెళ్లే మార్గంలో సైకిల్‌పై వెళ్తున్న ఆయనను గుర్తుతెలియని ఆటో బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న ఆటోను గుర్తించేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్