లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు

అగనంపూడి నుంచి గాజువాక వెళ్లే రహదారిపై శనివారం ఒక ప్రైవేట్ బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, క్రేన్ సహాయంతో బస్సును రోడ్డు పక్కకు తొలగించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం తొలగి, వాహనాల రాకపోకలు సజావుగా సాగాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్