అపోలో ఫార్మసీలో వాక్-ఇన్ ఇంటర్వ్యూలు

విశాఖపట్నంలోని అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కోసం ఈ నెల 6వ తేదీన (మంగళవారం) నగరంలోని అపోలో రీజినల్ ఆఫీస్, విశాలాక్షినగర్ నందు ఉదయం 10:00 నుండి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హెచ్. ఆర్ మేనేజర్ డేవిడ్ రాజు శనివారం తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ మరియు ఫార్మసీ చదివిన యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు తమ రెజ్యూమ్, జిరాక్స్ పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాలని కోరారు. పూర్తి వివరాలకు 9154117837 నంబర్‌లో సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕