గురజాడ జయంతి సందర్భంగా ఈ నెల 26వ తేదీన కన్యాశుల్కం నాటక ప్రదర్శన నిర్వహించనున్నట్టు నాటక గ్రంథాలయ అధినేత, కళాకారుడు బాదంగీర్ సాయి తెలిపారు. గురువారం ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. 26వ తేదీన కళాభారతి ఆడిటోరియంలో కన్యాశుల్కం నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. అందరూ ఆహ్వానితులేనని చెప్పారు.