ముంబైలో శనివారం జరిగిన బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్–2025లో జీసీసీ చెందిన అరకు కాఫీకి 'చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్' అవార్డు దక్కింది. ఫైనాన్షియల్ ట్రాన్స్‌ఫర్మేషన్ విభాగంలో ఈ గౌరవం లభించింది. జీసీసీ ఛైర్మన్, ఎండీ కల్పనా కుమారి కేంద్ర మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఇటీవల జీఐ ట్యాగ్ పొందిన అరకు కాఫీకి సేంద్రీయ గుర్తింపు కూడా లభించింది.