మంత్రి నారా లోకేశ్ సోమవారం విశాఖపట్నం రానున్నారు. ఈ రోజు రాత్రికి విశాఖ చేరుకుని ఎన్టీఆర్ భవన్‌లో బస చేస్తారు. రేపు ఉదయం విజయనగరం జిల్లా భోగాపురంలోని ఏపీ మోడల్ స్కూల్‌ను సందర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ మొదటి కాన్వొకేషన్ (పట్టాల ప్రదానోత్సవం)లో పాల్గొంటారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.