అరకు పీనరీలో ప్లాస్టిక్ నియంత్రణకు అటవీశాఖ కఠిన నిబంధనలు

డుంబ్రిగుడ మండలం అరకు పీనరీలో ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టేందుకు అటవీశాఖ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. పర్యాటకులు లోపలికి తీసుకెళ్లే ప్రతి ప్లాస్టిక్ బాటిల్ లేదా కవర్‌కు రూ. 20 డిపాజిట్ తీసుకొని స్టిక్కర్ అంటిస్తున్నారు. తిరిగి వెళ్లేటప్పుడు ఆ స్టిక్కర్ ఉన్న బాటిల్‌ను చూపించిన వారికి మాత్రమే డిపాజిట్ తిరిగి ఇస్తున్నారు. ప్లాస్టిక్ రహిత పీనరీని సాధించడమే ఈ నిబంధనల లక్ష్యమని సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్