గుర్తేడులో గంజాయి సాగు, రవాణాపై డ్రోన్లతో పోలీసుల నిఘా

గుర్తేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల గ్రామాల్లో గంజాయి రవాణా, సాగుపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ రాజ్ కోటి తెలిపారు. గురువారం గ్రామాల్లో డ్రోన్ కెమెరాలతో తనిఖీ చేపట్టారు. ప్రతీ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, గంజాయి ఆచూకీ తెలిస్తే దాడులు చేస్తామని, డ్రోన్ నిఘాతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్