మదర్ థెరిస్సా జయంతి ఉత్సవాలలో భాగంగా కోటాఉరట్ల ప్రభుత్వ హాస్పిటల్ లో మదర్ థెరిస్సా సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం హాస్పిటల్ లో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ.. మదర్ థెరిస్సా చేసిన సేవా కార్యక్రమాలు దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ సాటి మనిషికి సహాయం చేయాలనే భావంతో సమాజం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.