ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో డీటీసీ శ్రీనివాస్ సమావేశం

విశాఖపట్నంలో ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో డీటీసీ ఆర్సీహెచ్ శ్రీనివాస్ శుక్రవారం ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులతో సమావేశమయ్యారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని, దూర ప్రయాణాలకు ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరిగా ఉండాలని, ప్రతి బస్సులో ఫైర్ సేఫ్టీ పరికరాలు అమర్చాలని ఆదేశించారు. ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేయవద్దని, బస్సుల్లో హెల్ప్ లైన్ నంబర్ 9281607001 స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్