పారిశుద్ధ్య లోపాలు నివారించండి – ముందస్తు చర్యలకు డీపీవో సందీప్ ఆదేశాలు

తాజా వర్షాల దృష్ట్యా పారిశుద్ధ్య లోపాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి సందీప్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం పాయకరావుపేటలో పర్యటించిన ఆయన, మురుగు నీరు నిల్వ ఉండే ప్రదేశాలను పరిశీలించారు. వర్షపు నీరు గుంతలుగా నిల్వ కాకుండా వెంటనే తొలగించాలని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని మంచినీటి ట్యాంకులను శుభ్రపరచి క్లోరినేషన్ చేయించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్