విశాఖ: మాజీ ఎమ్మెల్యే సుమ‌న మృతి

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గంటల సుమన కన్నుమూశారు. అనారోగ్యంతో విశాఖపట్నంలోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1983లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆమె, ఆ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఆమె మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, స్థానిక నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భౌతికకాయాన్ని విశాఖపట్నంలోని నివాసానికి తరలించారు.

సంబంధిత పోస్ట్