దేశాభివృద్ధికి జనాభా గణన అత్యంత కీలకమని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనకాపల్లి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ జంక్షన్ నుంచి 5కే రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్డీఓ ఆనందలక్ష్మి మాట్లాడుతూ, ఈసారి జనాభా గణనను ఆన్‌లైన్ ద్వారా 'సెల్ఫ్ ఎన్యూమరేషన్' విధానంలో చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందించిన లింక్ ద్వారా ప్రతి పౌరుడు తమ వివరాలను నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. జనాభా లెక్కలు భవిష్యత్ సంక్షేమ పథకాలకు పునాది అని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ ఎన్. విజయ్ కుమార్, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.