రాష్ట్రంలోని ప్రైవేట్ పీజీ విద్యార్థుల పాలిట శాపంగా మారిన జీవో నెంబర్ 77ని రద్దుచేసి, వారికి కూడా ఫీజు రీ యింబర్స్‌మెంట్ వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ), అనకాపల్లి జిల్లా శాఖ కూటమి ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఆ జిల్లా శాఖ తరపున అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణకు వినతి పత్రాన్ని అందజేశారు.