ఒడిశా నుంచి కర్ణాటకకు తరలిస్తున్న 840 కేజీల గంజాయిని నక్కపల్లి పోలీసులు బుధవారం వెదుళ్లపాలెం కూడలిలో పట్టుకున్నారు. స్పష్టమైన సమాచారం మేరకు జరిపిన వాహన తనిఖీల్లో బొలెరో వాహనంతో పాటు రెండు బైకులు, నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన ఇద్దరిని పట్టుకునే పనిలో ఉన్నామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. పోలీసుల్ని ఆయన అభినందించారు.