అనకాపల్లి: 'అహిర్ రెజీమెంట్ పునరుద్దరించాలి'

అనకాపల్లిలో శుక్రవారం సాయంత్రం అహీర్ రెజిమెంట్ పునరుద్ధరణ కోసం రెజెంగ్లా పవిత్ర కలశ యాత్రలో భాగంగా గాంధీనగర్ నుంచి నెహ్రూ చౌక్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అఖిల భారత యాదవ మహాసభ సెక్రటరీ జనరల్ దొడ్డక ఆంజనేయ మూర్తి అహీర్ రెజిమెంట్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 1962 భారత్-చైనా యుద్ధంలో 120 మంది అహీర్ సైనికులు 1310 మంది చైనా సైనికులను మట్టుబెట్టిన ధీరకథనాన్ని గుర్తు చేస్తూ శుక్రవారం ఈ యాత్ర చేపట్టారు.

సంబంధిత పోస్ట్