దేశంలోని ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాలైన అయోధ్య, కాశి, కాలభైరవ దేవాలయాలను రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలోని భక్తుల ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీరామ జన్మభూమి మందిరాన్ని ప్రధమంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయాన్ని ఎంపీ కార్యాలయం గురువారం తెలిపింది.