ఎడ్యుకేషనల్ ఏఫిఫనీ నిర్వహించిన 2026 ఈఈఎంటి పరీక్షలో అనకాపల్లి జిల్లా కొత్తూరుకు చెందిన ముల్లి నాగ చైతన్య ప్రథమ బహుమతి సాధించాడు. ఆదివారం ఎంబీబీకే భవనంలో జరిగిన కార్యక్రమంలో అతన్ని అభినందిస్తూ 12 వేల రూపాయల నగదు బహుమతి, ప్రశంస పత్రం అందజేశారు. కాకినాడ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్ సి.ఎస్.ఆర్.కె. ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ విషయాన్ని ఆదివారం రాత్రి తెలియజేశారు.