అనకాపల్లి: రఘురామకృష్ణంరాజుపై దాడి హేయం

ఆకివీడులో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై జరిగిన దాడిని అనకాపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. బుధవారం అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భారీ పోలీసు భద్రత ఉన్నప్పటికీ మారణాయుధాలతో దాడికి దిగడం వెనుక పెద్ద కుట్ర కోణం ఉందని ఆరోపించారు. ఈ ఘటనకు కారకులైన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హిందూ పండుగల సమయంలో భక్తులకు, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్