తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ, నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవం, పేదల సంక్షేమం కోసం పార్టీని స్థాపించారని కొనియాడారు. "ప్రజలే దేవుళ్లు - సమాజమే దేవాలయం" సిద్ధాంతంతో ఎన్టీఆర్ వేసిన అడుగులు నేటికీ ఆదర్శమని, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ రాష్ట్రాభివృద్ధికి, నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.