అనకాపల్లి: పల్స్‌పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌

అనకాపల్లి జిల్లావ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ఎన్‌టీఆర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయాలని తల్లిదండ్రులకు ఆమె సూచించారు. పోలియో నిర్మూలనలో పల్స్ పోలియో కార్యక్రమం కీలకమని పేర్కొన్న కలెక్టర్, ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయాలని ఆదేశించారు. జూన్ 29, 30 తేదీల్లో మిగిలిన చిన్నారులను గుర్తించి పోలియో చుక్కలు వేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్