అనకాపల్లి: వేగం కంటే ప్రాణం విలువైనది

మంగళవారం సబ్బవరం సమీపంలోని ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్‌లో స్కూల్ బస్సు డ్రైవర్లకు రోడ్డు భద్రత, అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కంట్రోల్ ఆల్ట్ ఫిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రవాణా శాఖ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ స్టేషన్ ఆఫీసర్ యెల్లాజీ, సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలపై డ్రైవర్లకు ప్రాక్టికల్ డెమోలతో వివరించారు. విద్యార్థుల భద్రత తమపై ఉన్న గొప్ప బాధ్యత అని నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్