అన‌కాప‌ల్లి: ఆలయానికి తాళం వేసి మహానాడు నిర్వహణ

అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాలయానికి బయట తాళం వేసి, లోపల మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించడం వివాదానికి దారితీసింది. ఆలయం చుట్టూ టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అధికార అహంకారంతో పవిత్ర ఆలయాలను అపహాస్యం చేయడం ఎంతవరకు సమంజసమని భక్తులు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన నాయకులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్