చంద్రబాబుది జగన్ లాంటి కక్ష సాధింపు వ్యక్తిత్వం కాదని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. చంద్రబాబు లాంటి సంయమనం జగన్‌కి లేదన్నారు. వైసీపీ నేతలు స్వేచ్ఛగా తిరగడానికి చంద్రబాబే కారణమన్నారు. జగన్ అవినీతిపై సీబీఐ, ఈడీతో విచారణ చేయిస్తామని చెప్పారు. ఇక పులివెందుల జడ్పీటీసీకి బీటెక్ రవి భార్య పోటీలో ఉన్నారని, ఆమె గెలుపు ఖాయమన్నారు.