అనకాపల్లి ఎంపీ సి. ఎం. రమేష్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిసి, అనకాపల్లిలోని లక్ష్మీదేవిపేట రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. సికింద్రాబాద్‌లో జరిగిన సమావేశంలో, ట్రాఫిక్ సమస్యల నివారణ, ప్రజల భద్రత దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే జీఎం సానుకూలంగా స్పందిస్తూ, ఈ ఆర్వోబీతో పాటు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇతర రైల్వే అభివృద్ధి పనుల అమలుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఆర్వోబీ నిర్మాణం దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉంది.