అనకాపల్లి మండలం కొత్తూరు, పిసినికాడ పంచాయతీ పరిధిలోని రామాపురం రామభద్రపురం బి ఆర్ టి కాలనీలో బుధవారం శ్రీ నల్లమారమ్మ పండగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఉదయం నుంచి ప్రజలు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బోడి వెంకటరావు, కోట్ని రామకృష్ణ, కాండ్రేగుల సత్యనారాయణ, పొలిమేర నాయుడు, ఆహ్వానం కమిటీ సభ్యులు కోన శ్రీను తదితరులు పాల్గొన్నారు.