జులై 17న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు మొల్లి సన్నిబాబు పిలుపునిచ్చారు. అనకాపల్లి పట్నం విజయ రెసిడెన్సిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే చట్టసభల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.