పెదబయలు మండలం బొండాపల్లికి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ మత్స్యబాబు రూ.15.62 లక్షల పింఛన్ నగదు తీసుకొని గురువారం ఇంటికి వెళ్తుండగా రాయిపల్లివద్ద ఇద్దరు దుండగులు ఆయన్ని అడ్డగించి తుపాకీ, కత్తులతో బెదిరించి డబ్బు దోచుకున్నారు. వారు స్కూటీపై పారిపోగా, మత్స్యబాబు వారిని వెంబడించి వాహనాన్ని ఒడిశాలోని పొలాల్లో పట్టుకున్నారు. పోలీసులకు అప్పగించిన స్కూటీలో రూ.5 లక్షలు లభించాయి.