అనకాపల్లి: గంజాయి స్మగ్లర్‌పై ‘పీఐటీ ఎన్డీపీఎస్’ అస్త్రం

అనకాపల్లి జిల్లాలో గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. బెన్న భూపాలపట్నంకు చెందిన ఐతిరెడ్డి అశోక్ (30)పై పీఐటీ ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద ప్రివెంటివ్ డిటెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇతనిపై పలు గంజాయి కేసులు ఉన్నా, జైలు నుంచి వచ్చాక ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. శనివారం నిందితుడిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. పదేపదే నేరాలకు పాల్పడే వారిపై ఇలాంటి ఉక్కుపాదం తప్పదని ఎస్పీ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్