అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలపై “పోలీసు వెల్ఫేర్ డే” ను శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు. వారి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి వేగవంతమైన చర్యలు తీసుకోవడానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ, పోలీసు సిబ్బంది సంక్షేమం పట్ల నిబద్ధతతో వ్యవహరిస్తూ, వారి సమస్యలను పరిష్కరించడం కోసం అందుబాటులో ఉంటానన్నారు.