సుంకరమెట్టలోని శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామి మరియు ఉషా ఛాయా పద్మిని సమేత సూర్యనారాయణ స్వామి వార్ల దేవస్థానంలో కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, ఎంపీ సీఎం రమేష్, పీలా గోవింద సత్యనారాయణ, భీమరశెట్టి రాంకీల ప్రోత్సాహంతో ఈ వేడుకను నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ బొడ్డేడ మురళి దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు కల్యాణ క్రతువులో పాల్గొన్నారు. అనంతరం తిమ్మాపాత్రుని చక్రవర్తి ఆధ్వర్యంలో జరిగిన సత్యనారాయణ స్వామి వారి ఉంజల్ సేవ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.