అనకాపల్లి టీడీపీ కమిటీ ప్రమాణ స్వీకారం

అనకాపల్లి పెంటకోట కళ్యాణ మండపంలో బుధవారం అనకాపల్లి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కమిటీ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా ఇంచార్జి మంత్రి కొల్లు రవీంద్ర, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ వేపాడ చీరంజీవి హాజరయ్యారు. రెండోసారి జిల్లా టిడిపి అధ్యక్షునిగా బత్తుల తాతయ్య బాబు, జిల్లా ప్రధాన్ కార్యదర్శిగా లాలం కాశీ నాయుడు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రాక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్