అనకాపల్లి: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

అనకాపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం నిర్వహించి ప్రజల వినతులు స్వీకరించారు. రహదారులు, కాలువలు, తాగునీరు, వీధి దీపాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలపై వచ్చిన వినతులను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సమస్యల పరిష్కారానికే ఈ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్