కడప మున్సిపల్ కార్మికులకు టెక్నికల్ వేతనాలు చెల్లించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని, 12వ పీఆర్సీ ప్రకటించాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో ఏవోకు వినతి పత్రం సమర్పించారు. సమస్యలు పరిష్కరించకపోతే జూలై 15న విజయవాడలో నిర్వహించే ఆందోళనకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.