అనకాపల్లి గవరపాలెంలోని అంబేద్కర్ నగర్‌లో డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం హేయమైన చర్య అని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న తీవ్రంగా ఖండించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారని ఆరోపించారు. ఇటువంటి చర్యలు సమాజంలో ప్రజల ఐక్యతను దెబ్బతీస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనకు బాధ్యులైన దుండగులను వెంటనే గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు.