అనకాపల్లి: వెంకమ్మ కృష్ణ సాగరం చెరువుకు పూర్వవైభవం

అనకాపల్లి జిల్లా ఎస్. రాయవరం మండలం జె. వి. పాలెం రైతుల దశాబ్దాల కల నెరవేరనుంది. ప్రభుత్వం చేపట్టిన 'జలధార - జలహారతి' కార్యక్రమంలో భాగంగా 145 ఎకరాల వెంకమ్మ కృష్ణ సాగరం చెరువు పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. పూడికతీత, గట్ల పటిష్టీకరణతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, 150 ఎకరాల ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు అందనుంది. భూగర్భ జలాలు వృద్ధి చెంది, పొలాలు సారవంతం అవుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్