అనకాపల్లి: డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నిరసన

అనకాపల్లిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో "దగా డీఎస్సీ"కి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని, నిరుద్యోగ యువతకు అన్యాయం జరుగుతోందని జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్